Tuesday 19 April 2016

గురు భక్తి


                                                    గురు భక్తి
 జగత్ గురు శంకరాచార్యుల వారి శిష్యులలో పద్మపాదుడు  అని ఒక శిష్యుడు ఉండే వాడు  . 
అతనికి గురు భక్తి మెండు మిగిలిన అందరు శిష్యులు చదువులో ముందుండే వారు పద్మ పాదుడు మాత్రం గురు సేవలో నిమగ్నమై 
సరిగా చదవలేకపోయేవాడు  ఏది చూసి మిగిలిన శిష్యులు ఇతనిని చులకనగా చూసేవారు  ఇది ఇలా ఉండగా  ఒకరోజు 
పద్మపాదుడు గురువుగారి వస్త్రాలను నది మద్యలో ఉన్న ఇసుక తిన్నెపై  ఉతికి ఆరబెట్టుచుండగా నది  భయంకరంగా పొంగి 
 ఇసుక తిన్నేను ముంచివేసింది .వెంటనే గురువు గారికి దీక్షా  వస్త్రము అందివ్వాలనే ఆత్రుతతో గురువు గారి అనుగ్రహముపై  నమ్మకముతో 
ప్రాణాలకు తెగించి ప్రవాహములో కి దిగి నడవటం మొదలు పెట్టాడు గురువుగారి నామస్మరణ చేసుకుంటూ ఆటను అల నడుస్తుంటే అడుగడుగునా  అతని పాదము పెట్టడానికి వీలుగా ఒక పద్మము అక్కడ ప్రత్యక్షమయిందిఈవిధముగా  పద్మల మిద  అడుగులు వేసుకుంటూ 
అతను నదిని దాటి ఒడ్డుకు చేరాడు .  ఒడ్డున నిలబడి చూస్తున్న మిగిలిన శిష్యులు అతని గురు భక్తికి ఆశ్చర్యపడి  తమ అవివేకానికి సిగ్గుతో తలవంచుకున్నారు ఇది అంతా
గమనించిన గురువు గారు అతని గురు భక్తికి సంతసించిన వారై ప్రేమతో అతనికి " పద్మపాదుడు  " అని నామకరణ చేసారు ఆరోజు నుండి అతనిని పాధపద్ముడు  అని పిలుస్తున్నారు.


నీతి : ఎంతటి కష్ట్తాన్ని ఐనదాటించగల శక్తి గురుభక్తికి ఉంది అంటే మనమందరం గురువుగారి అడుగు జాడలలో నడవాలి అప్పుడే మనకి అభివృద్ధి

No comments:

Post a Comment