Monday 18 April 2016

ఆసక్తి


                                                     ఆసక్తి





శ్రీరామ పట్టాభిషేకం  ఐన తరువాత శ్రీరాముల    వారి కి ఆంజనేయ స్వామి వారే అన్ని సేవలు చేస్తూ సర్వదా  స్వామి వెంటే ఉంటూ ఉన్నారు  
 శ్రీరాముల వారి తమ్ములైన భరత,లక్ష్మణ , శతృజ్ఞులు   ఎంతగా ప్రయత్నించిన శ్రీరాముల వారికీ   సేవ కూడా చేయలేక పోతున్నారు అమీ చేద్దామన్న
ముందుగానే మారుతీ అక్కడ ఉంటున్నారు ఇలాకొంత కాలం గడిచింది ఎలా ఐన  అన్నగారి సేవ చేయాలనీ బాగా అలోచించి  భరత,లక్ష్మణ , శతృజ్ఞులు. ఒక ఉపాయం అలోచించి  అన్నగారైన శ్రీ రాముల వారి దగ్గరకు వెళ్లి  అగ్రజా  ! తమ సేవ చేయు భాగ్యము మా ముగ్గురికి ప్రసాదించవలసింది  అని కోరుకున్నారు

ఏది విన్న శ్రీరామ చంద్రుడు  మీరు అసేవ చేయాలనుకుంటున్నారో సేవను ఆనందం గా చేసుకోండి అని  చెప్పారుఏది విని ముగ్గురు సంతోషంగా  అన్నగారికి చేయాలనుకుంటున్న సేవలను ఒక పట్టికగా  రాసుకుని  ఎవరెవరు సేవ చేస్తారో రాముల వారికి చదివి వినిపించి . రాముల వారి అనుమతిని పొందారు   ఇది విన్న ఆంజనేయ స్వామి  శ్రీ రాముల వారితో స్వామి అన్ని సేవలు వారు ముగ్గురే పంచుక్కరు కదా "మరి  నా గతి  ఏమి  ? స్వామి అని  అడిగారు
 ఇంతలో   భరత,లక్ష్మణ , శతృజ్ఞులు   శ్రీ రామ చంద్రుడు మా ప్రార్ధన  మన్నించారు . వారు ఆడిన మాట తప్పారు కావున మేము కోరగా మిగిలిన సేవ ఏదైనా  ఉంటె ఆంజనేయుడు చేసుకోన వచును అని  భరత,లక్ష్మణ , శతృజ్ఞులు    చెప్పారు రాముల వారితో  అప్పుడు ఆంజనేయ స్వామి బాగా అలోచించి  "  సరే మీ షరతును అనుసరించే  కోరుకుంటాను  అని రాముల వారు "ఆవులించినపుడు " చిటిక వేసే   భాగ్యము నాకు  ప్రసాదించిన చాలును  అని అనగా  దానికి  భరత,లక్ష్మణ , శతృజ్ఞులు  మాకు అభ్యంతరం అమీ లేదు అని  సేవ ఆంజనేయుడు చేసుకోన వచ్చు  అని పలికిరి . విదముగా తీర్మానము   ఐనది
 శ్రీ రాముడు స్నానానికై లేవగా సేవ  తన వంతైనా లక్ష్మణుడు బయలుదేరాడు   ఇంతలో  హనుమతుడు  నీవేక్కడికి సేవ నావంతు  అని అన్నారు ఆశ్చర్యంగా చుసుతున్న లక్ష్మణుడితో ఆంజనేయుడు అయ్యా స్నానము చేయునపుడో, దుస్తులు దరిన్చునపుడో,అలంకరించు సమయములోనో ,భోజన కాలములోనో ,శయనించు సందర్భాములోనో  ఎప్పుడుడైన 
 " నా స్వామికి ఆవులింత రావచును అప్పుడు తక్షణమే చిటిక వేయుటకు నేను సిద్దముగా ఉండవలెను కదా ?" అందుచే మీ సేవ మీరు చేసుకునుడు  నా సేవకు అడ్డువచ్చుట  ధర్మమా ? అని అనెను ఇది విన్న   భరత,లక్ష్మణ , శతృజ్ఞులు మారుతి యొక్క యుక్తికి , అద్వితీయ సేవాసక్తికి ,రామ భక్తికి  మేచుకున్నారు


నీతి : ఆసక్తి ఉంటె అన్ని సాధ్యమే

No comments:

Post a Comment