Monday 25 April 2016

గురు పాదుక స్తోత్రం


రచన: ఆది శంకరాచార్య
అనంతసంసార సముద్రతార నౌకాయితాభ్యాం గురుభక్తిదాభ్యామ్ |
వైరాగ్యసామ్రాజ్యదపూజనాభ్యాం నమో నమః శ్రీగురుపాదుకాభ్యామ్ || 1 ||
కవిత్వవారాశినిశాకరాభ్యాం దౌర్భాగ్యదావాం బుదమాలికాభ్యామ్ |
దూరికృతానమ్ర విపత్తతిభ్యాం నమో నమః శ్రీగురుపాదుకాభ్యామ్ || 2 ||
నతా యయోః శ్రీపతితాం సమీయుః కదాచిదప్యాశు దరిద్రవర్యాః |
మూకాశ్ర్చ వాచస్పతితాం హి తాభ్యాం నమో నమః శ్రీగురుపాదుకాభ్యామ్ || 3 ||
నాలీకనీకాశ పదాహృతాభ్యాం నానావిమోహాది నివారికాభ్యామ్ |
నమజ్జనాభీష్టతతిప్రదాభ్యాం నమో నమః శ్రీగురుపాదుకాభ్యామ్ || 4 ||
నృపాలి మౌలివ్రజరత్నకాంతి సరిద్విరాజత్ ఝషకన్యకాభ్యామ్ |
నృపత్వదాభ్యాం నతలోకపంకతే: నమో నమః శ్రీగురుపాదుకాభ్యామ్ || 5 ||
పాపాంధకారార్క పరంపరాభ్యాం తాపత్రయాహీంద్ర ఖగేశ్ర్వరాభ్యామ్ |
జాడ్యాబ్ధి సంశోషణ వాడవాభ్యాం నమో నమః శ్రీగురుపాదుకాభ్యామ్ || 6 ||
శమాదిషట్క ప్రదవైభవాభ్యాం సమాధిదాన వ్రతదీక్షితాభ్యామ్ |
రమాధవాంధ్రిస్థిరభక్తిదాభ్యాం నమో నమః శ్రీగురుపాదుకాభ్యామ్ || 7 ||
స్వార్చాపరాణామ్ అఖిలేష్టదాభ్యాం స్వాహాసహాయాక్షధురంధరాభ్యామ్ |
స్వాంతాచ్ఛభావప్రదపూజనాభ్యాం నమో నమః శ్రీగురుపాదుకాభ్యామ్ || 8 ||
కామాదిసర్ప వ్రజగారుడాభ్యాం వివేకవైరాగ్య నిధిప్రదాభ్యామ్ |
బోధప్రదాభ్యాం దృతమోక్షదాభ్యాం నమో నమః శ్రీగురుపాదుకాభ్యామ్ || 9 ||

కలసి ఉంటే కలదు సుఖం

                                             

 ఒకానొకప్పుడు ఒక ఊరిలొ ఒక రైతు ఉండే వాడు అతను తనకు ఉన్న పొలంలో  పంట పండించుకుంటూ ఉన్నదాంట్లో తృప్తిగా జీవిస్తున్నాడు
 అతని భార్య కూడా అతనికి అన్ని పనులలో సహాయం చేస్తూ అత్తమామలతో ఆనందంగా కలిసి జీవిస్తున్నారు
కొన్ని సంవత్సరాలకు  వారికి నలుగురు సంతానం కలిగారు  ఆ నలుగురు పిల్లలు ఎప్పుడు తమలో తాము ఎప్పుడు గొడవపడుతూ ఉండే వారు 
తల్లి ఎంతగా  చెప్పిన వినే వారు కాదు ప్రతి చిన్న విషయానికి కొడవ పడుతూ  కొట్టుకునే వారు  ఇలాగే వాళ్ళు పెరిగి పెద్దయ్యారు తండ్రి ముసలి వాడు ఐ  పోయాడు ఈ  కొడుకులు ఇలా ప్రతి చిన్న విషయానికి గొడవపడటం ఆయనకీ తీర్చలెని చింతగా తయ్యరైనది  వీళ్ళు ఇలాగే ఉంటే జీవితం లో అన్ని కోల్పోయీ నష్టపోతారని అలోచించి అ తండ్రి కొడుకులకు కలసి ఉంటే ఉండే సుఖ సంతోషాలు ఎలా ఉంటాయో తెలియ చెప్పాలని నిర్ణయం  చేసుకుని తన నలుగురు కొడుకులని పిలిచి తనకున్న పొలాన్ని నాలుగు భాగాలు చేసి  తన కొడుకులకు ఇచ్చి ఒక మాట  చెప్తాడు  ఈ పోలాన్ని   మీ నలుగురిలో ఎవరు భాగా పండిస్తారో వాళ్ళకి ఈ పొలం మొత్తాన్ని ఇచేస్తాను అని చెప్పి పంపాడు . అది విన్న నలుగురు కొడుకులు ఎలాగైనా అ పొలాన్ని తామే దక్కించుకోవాలని ఉద్దేశం తో  ఒకరి మీద ఒకరు పోటి పడి  తమకు వచ్చినట్టుగా వ్యవసాయం చేసారు పంట చేతికి వచ్చింది ఎవరు కుడా తమ తండ్రి పండించే ధాన్యంలో సగం కూడా పండిన్చాలేకపోయారు . ఐతే ఈ నలుగురు కూడా వ్యవసాయానికి సంబందించిన ఒకొక్క పనిలో ఒకొక్కరు  మంచి నైపుణ్యం కలిగిన వారు . తండ్రి వాళ్ళు పండించిన పంటను చూసి ఒక చిరునవ్వు నవ్వి ఆ నలుగురితో  ఈ సారి మీ నలుగురు మొత్తం పొలాన్ని కలిసి పండించండి అని అన్నాడు  అది విన్న నలుగురు అన్నదమ్ములు తెల్లారి పొలం దగ్గరకు వెళ్లారు వారిలో ఎవరికి ఎపని బాగా తెలుసో వాళ్ళు ఆ పని చేస్తామని పొలం పనిని మొత్తాన్ని నాలుగు భాగాలుగా విభజించుకుని భాగా కష్ట పడి  నలుగురు కలిసి పంట పండించారు  ఈ సారి పంట భాగా వచ్చింది . తమ తండ్రి పండించే దానికన్నా ఎక్కువగా  పండించారు అది చుసిన తండ్రి వాళ్ళ నలుగురిని పిలిచి ఇప్పుడు అర్థం ఐనదా   మీకు  మీ నలుగురు విడివిడిగా పండించిన పంట కన్నా నలుగురు కలిసి ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ    కలసి పండించిన  పంట ఎక్కువగా మరియు నాణ్యంగా ఉందొ చూసారు కదా 

ఇప్పటికైనా అర్థం ఐనద విడివిడిగా ఉంటూ కష్టాలు పడుతూ ఉండే కంటే కలసి ఉంటే సంతోషం సుఖం కూడా ఉందని   అన్న తండ్రితో అ నలుగుడు కొడుకులు తండ్రి కాళ్ళ పై బడి మమ్మల్ని క్షమించండి నాన్న మీరు ఎంతగా చెప్పిన మాకు అర్థం కాలేదు కాని ఈ రోజు మాకు అర్థం ఐనది ఇంకేపుడు జీవితం లో మేము విడిపోము అని అన్నారు తన కొడుకులలో వచ్చిన మార్పును చూసి ఆ తల్లిదండ్రులు సంతోషించారు  ఆపై  ఆ అన్నదమ్ములు ఆనందంగా కలసిమెలసి జీవించారు . 

నీతి  : అందరికంటే తానె తెలివైన వాడినని భావించి ఒక్కడిగా సాధించే విజయం కంటే నలుగురితో కలసి మెలసి ఒకరికొకరు సహాయం చేసుకుంటూ పనిచేస్తే విజయాన్ని తొందరగా  పొంద వచ్చు కలసి ఉంటె ఓటమి దరిచేరదు . 


Saturday 23 April 2016

ముందు చూపు

                                       ముందు చూపు 



రాధ ,సిత ,గీత అనే మూడు  చేపలు ఒక నదిలో నివసిస్తూ ఉండేవి ఒక సారి వేసవిలో చెరువులో నిరు బాగా తగ్గి పోయాయి  అది గమనించిన రాధా ,సిత ,గీత లతో మనం ఈ  నదిని వదిలి వేరే నీరు  ఎక్కువగా  ఉన్న  నదిలోకి ఇప్పుడే వెళ్లి పోదాము . ఇప్పుడే ఈ నదిలో నీరు చాల తగ్గి పోఎంది ఇంకా కొన్ని  రోజులు ఐతే ఇంకా నీరు తగ్గిపోతుంది అప్పుడు చేపలు పట్టే వాళ్ళు వచ్చి మనల్ని పట్టుకు పోతారు  కాబట్టి మనం ఇప్పుడే ఈ నదిని వదిలి వెల్లిపోదాం అని అంది అది విన్న సిత ,గీత లు అ ఎప్పుడో కష్టం వస్తుంది అని ఇప్పుడే ఎందుకు ఆలోచించడం ,ఐన ఇప్పుడు మనం ఈ మడుగులో చాల సుఖం గా ఉన్నాము కదా , ఐన నువ్వు  అన్నట్టు కష్టం వచ్చిన అప్పటికి అదో ఒక ఉపాయం తట్టక పోతుందా  అని అన్నాయీ ఇది  విన్న రాధా వీళ్ళు ఎలాగు  రారు వీళ్ళతో ఉంటె నేను కూడా చావాల్సి వస్తుంది అని అది ఆ చెరువులోకి నీరు వచ్చే పిల్ల కాలువలోకి వెళ్లి దాని లో ఈదుకుంటూ బాగా నీరు ఉన్న వేరే జలాశయం లోకి చేరి సంతోషంగా   ఉంది .  కొద్ది రోజులు గడిచాయి   చెరువులో నీళ్ళుఇంకా తగ్గాయి కొందరు చేపలు పట్టే  వాళ్ళు అ చెరువులోకి వచ్చి వల వేసి చేపల్ని పట్టుకున్నారు అప్పుడు సిత, గీతాలకి రాధ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి  తన మాట విని ఉంటె మనకు ఈ రోజు  ఈ  పరిస్థితి వచ్చేది కాదు కదా అని అనుకున్నాయి ,ఇప్పుడు


ఆలోచించి ఏమి లాభం   ఇంతలో సీతకి ఒక ఆలోచన వచ్చింది ఇప్పుడు ఈ  వలలో చచ్చి నట్టు పడి  ఉండి తర్వాత సమయం చూసి తప్పించుకుంటాను అని అనుకుని ఆ వలలో పడింది జాలరి వాళ్ళు చేపలు పట్టుకుని పోయి  బురదగా ఉన్నాయి  అని కడగటానికి వేరే నీరు ఎక్కువగా ఉన్న చెరువు దగ్గరకి వెళ్లి ఆ  చేపలన్నటిని  కడగా సాగారు అప్పుడు సిత తెలివిగా ఆ వల నుండి తప్పించుకు పోయింది , పాపం గీత మాత్రం జాలరి వాడికి చిక్కి  అమ్ముడు పోయింది . 

నీతి  :  అపాయాన్ని  ముందుగా గుర్తించి తప్పించుకునే వాడే తెలివైన వాడు  ఎవారి కైనా ముందు చూపు ఉన్నపుడే  జీవితం లో ఎదురయ్యే సమస్యల నుండి తెలివిగా తప్పించుకోగలడు .  

Friday 22 April 2016

మంచి మిత్రుడు

                                                        మంచి మిత్రుడు 


ఒకానొకప్పుడు   ఒక అడవిలో ఒక కాకి ,ఒక పావురం ఉండేవి అవి ఎంతో స్నేహంగా ఉండేవి చాల సంతోషంగా  కాలం గడుపుతూ ఉండేవి పావురం ఉండానితో తృప్తిగా  ఉంటూ తన పిల్లలతో సంతోషం గ ఉండేది దొరికిన గింజలను తను తన పిల్లలు తినగా కొన్ని గింజలు మరుసటి రోజుకు దాచి పెట్టుకునేది.  అందరితో మంచిగా ఉంటూ అందరి చేత మంచిదని అనిపించుకునేది అడిగిన వారికి సహాయం చేస్తూ ,



కాకి మాత్రం అందరికి పొగరుగా సమాదానం చెప్తూ  దొరికినది మొత్తం తినేసి రేపటి కోసం ఏమి  జాగ్రత్త పడకుండా ఇష్టo వచ్చి   నట్టు ఉంటూ అందరిని అవమాన పరుస్తు ఉండేది.   

ఇది  ఇలా  ఉండగా ఒకరోజు అడవిలో పెద్ద గాలి,వాన వచ్చి పావురం గూడు మొత్తం పడైపోఎంది . పావురం తన పిల్లలితో కాకి ఇంటికి వచ్చి తనకి తన్న పిల్లలకి ఉండటానికి  కొంచం చోటు ఇవ్వ మంటుంది  . దానికి కాకి పావురం తో అయ్యో మా ఇంట్లో మేము ఉండటానికే చాల ఇరుకుగా ఉంది ఇంకా మీకు అక్కడ చోటు ఇవ్వాలి కాబట్టి వేరే అవారి ఇంటి కైనా  వెళ్లి ఉండండి అని అంది . పావురం పాపం బాధ పడుతూ తన పిల్లల్ని తీసుకుని వేరే ఇంటికి వెళ్లి సహాయం అడిగింది .  వాళ్ళు పావురానికి సహాయం చేసారు 
తెల్లారి వర్షం తగ్గింది పావురం తన పిల్లల కోసం మళీ ఒక గూడు  కట్టుకుంది దానికి మిగిలిన పక్షులు అన్ని సహాయం చేసాయి   మళి పావురం తన పిల్లలితో సంతోషం గ జివించ సాగింది . 

ఇది  ఇలా  ఉండగా ఒకరోజు అడవిలో పెద్ద గాలి , వాన  వచ్చి కాకి గూడు మొత్తం పాడై  పోఇంది  కాకి తన పిల్లలని  తీసుకుని ఒక్కొక్కరి ఇంటికి వెళ్లి తను తన పిల్లలు ఉండటానికి కొంచం చోటు ఇవ్వమని బ్రతిమిలాడింది కానిఎవ్వ లేదు  ఆకరికి పావురం ఇంటికి వెళ్లి  తలుపు తట్టింది పావురం తలుపు తీసి అయ్యో మిత్రమా అంటిది ఎలా పిల్లల్ని తీసుకుని ఎ వర్షం లో అమైంది అని అడిగింది గాలి వాన కి తన గుడు  పాడై పోఎందని చెప్పింది  ఏది విన్న పావురం అయ్యో  ముందు ఇంట్లోకి రండి అని ఉండటానికి చోటు ఇచ్చి   అన్నం కూడా పెట్టింది వర్షం  తగ్గక కాకి కి ఒక గూడు కూడా కట్టుకోవడానికి  సహాయం చేసింది .  కాకి  పావురం యెక్క గొప్ప మనసుకి వ్యక్తిత్వానికి ,సంస్కారానికి  ఆశ్చర్యపడింది  ఇంతక ముందు తను పావురానికి చేసినది తల్చుకుని సిగ్గు పడి . పావురానికి క్షమాపణ చెప్పింది అప్పటి నుండి అది కూడా అందరితో  కలసి మెలసి జివించ సాగింది . 


నీతి  :  అపకారం చేసిన వాడికి కూడా ఉపకారం చేయడమే గొప్ప వాళ్ళ లక్షణం 

Wednesday 20 April 2016

తెలివైన తాబేలు

                                                               తెలివైన తాబేలు 

ఒక సరి ఒక   అడవిలో ఒక కుందేలు, ఉండేది దానికి బాగా పరిగేత్త గలను అని తనలా ఇంకెవరు పరిగెత్త లేరు అని  తనను తానూ చూసుకుని గర్వ పడేది  ఇది ఇలా ఉండగా అదే అడవిలో ఇంకో తాబేలు కూడా నివసిస్తు ఉండేది,
తాబేలు నెమ్మదిగా నడుస్తూ ఉండేది అది వేగంగా పరుగెత్త లేక పోయేది ఏది చూసి కుందేలు గర్వంగా తాబేలు వైపు చూసి  నవ్వుతు చూసావా ...! న కాళ్ళలో ఎంత బలం ఉందొ నేను  నీకంటే  చాలా  వేగంగా  పరుగెత్త గలను అని  రోజు వెక్కిరించేది , తాబేలు మాత్రం అమీ అనకుండా మౌనముగా తన దారిన తానూ వెళ్తూ ఉండేది .   ఇది  ఇలా  ఉండగా 
ఒకరోజు కుందేలు  ఎలాగైనా  తాబేలుకి తను  ఎంత వేగంగా పరుగేత్తగలదొ  చూపించి దాన్ని  అవమాన పరచాలని అలోచించి ఒక రోజు కుందేలు  తాబేలు దగ్గరికి వెళ్లి తాబేలు తాబేలు మన మిద్దరం పరుగు పందెం పెట్టుకుందాం  అని అడిగింది దానికి తాబేలు నే అంట వేగంగా నేను పరుగెత్త లేను ఈ పందానికి  ఒప్పుకోవటం లేదు అని చెప్పింది ిన సరే కుందేలు తాబేలుని బ్రతిమిలాడి మొత్తానికి పరుగు పందానికి ఒప్పించింది మరుసటి రోజు ఉదయమే కుందేలు , తాబేలు అనుకున్న ప్లేస్  కి వచయే పందెం మొదలైనది  కుందేలు చాల వీగంగా పరిగెత్తుకుంటు  వెళ్లి చేరవలసిన గమ్యానికి దగ్గరలో గల ఒక చెట్టుకింద ఆగి వెనకకి తిరిగి చూసింది అక్కడా  తాబేలు వస్తున్న జాడ కనిపించక అటు ఎటు చూసింది వేగంగా పరుగెత్తడం వలన కుందేలు బాగా అలసిపోఎంది సరే తాబేలు రావడానికి చాల సమయం పడుతుంది కదా ఈ లోగా  ఎ చేట్టుకుండా విశ్రాంతి తీసుకుందాం అని అనుకుని అది చెట్టుకింద పడుకుంది అల కుందేలు అలసిపోవడం వలన గాడ  నిద్రలోకి వెళ్ళిపోయింది  
             ఇంతలో తాబేలు కొద్ది సేపటికి నెమ్మదిగా నడుచుకుంటూ  కుందేలు ఉన్న ప్రదేశానికి వచ్చింది పడుకున్న కుందేలుని చూసి  తను చేరవలసిన గమ్యం విపుకి చేరిపోతుండగా  కుందేలుకు మెలకువ వచ్చింది  చేరవలసిన గమ్యానికి దగ్గరగా తాబేలు కనిపించింది అది చూసి కుందేలు వేగంగా పరిగెత్తసాగింది ఈ లోపల  తాబేలు గీతను దాటేసింది 
ఈలోగా అక్కడికి వచ్చిన కుందేలు తాబేలుని చూసి నన్ను క్షమించు వేగంగా పరుగేత్త గలను అనే గర్వంతో నిన్ను అవమానించాలని ఈ  పందెం పెట్టాను . నన్ను క్షమించు అని అడిగింది దానికి తాబేలు ఎప్పటికైనా తెలుసుకున్నావ్ అని   ఎప్పటినుండి మనం స్నేహితులం అని చక్కగా కలసిమెలసి ఆనందంగా జీవించాయి  

నీతి :  నిదానమే ప్రదానము  బలం ఉంది కదా అని అహంకారం ఉండకూడదు అలోచించి అడుగులు వేయాలి అంతే కాని ఎవ్వరిని చులకనగా చూడకూడదు . 





Tuesday 19 April 2016

గురు భక్తి


                                                    గురు భక్తి
 జగత్ గురు శంకరాచార్యుల వారి శిష్యులలో పద్మపాదుడు  అని ఒక శిష్యుడు ఉండే వాడు  . 
అతనికి గురు భక్తి మెండు మిగిలిన అందరు శిష్యులు చదువులో ముందుండే వారు పద్మ పాదుడు మాత్రం గురు సేవలో నిమగ్నమై 
సరిగా చదవలేకపోయేవాడు  ఏది చూసి మిగిలిన శిష్యులు ఇతనిని చులకనగా చూసేవారు  ఇది ఇలా ఉండగా  ఒకరోజు 
పద్మపాదుడు గురువుగారి వస్త్రాలను నది మద్యలో ఉన్న ఇసుక తిన్నెపై  ఉతికి ఆరబెట్టుచుండగా నది  భయంకరంగా పొంగి 
 ఇసుక తిన్నేను ముంచివేసింది .వెంటనే గురువు గారికి దీక్షా  వస్త్రము అందివ్వాలనే ఆత్రుతతో గురువు గారి అనుగ్రహముపై  నమ్మకముతో 
ప్రాణాలకు తెగించి ప్రవాహములో కి దిగి నడవటం మొదలు పెట్టాడు గురువుగారి నామస్మరణ చేసుకుంటూ ఆటను అల నడుస్తుంటే అడుగడుగునా  అతని పాదము పెట్టడానికి వీలుగా ఒక పద్మము అక్కడ ప్రత్యక్షమయిందిఈవిధముగా  పద్మల మిద  అడుగులు వేసుకుంటూ 
అతను నదిని దాటి ఒడ్డుకు చేరాడు .  ఒడ్డున నిలబడి చూస్తున్న మిగిలిన శిష్యులు అతని గురు భక్తికి ఆశ్చర్యపడి  తమ అవివేకానికి సిగ్గుతో తలవంచుకున్నారు ఇది అంతా
గమనించిన గురువు గారు అతని గురు భక్తికి సంతసించిన వారై ప్రేమతో అతనికి " పద్మపాదుడు  " అని నామకరణ చేసారు ఆరోజు నుండి అతనిని పాధపద్ముడు  అని పిలుస్తున్నారు.


నీతి : ఎంతటి కష్ట్తాన్ని ఐనదాటించగల శక్తి గురుభక్తికి ఉంది అంటే మనమందరం గురువుగారి అడుగు జాడలలో నడవాలి అప్పుడే మనకి అభివృద్ధి

మన కధలు: మనం మన సంస్కృతి , మన విలువలు

మన కధలు: మనం మన సంస్కృతి , మన విలువలు:                                                 గోవింద  హలో ఫ్రెండ్స్ ........   వేసవి సెలవులు  వచేసయే కదా  పిల్లల కోసం నీతి కధలు ఎ రోజ...

Monday 18 April 2016

ఆసక్తి


                                                     ఆసక్తి





శ్రీరామ పట్టాభిషేకం  ఐన తరువాత శ్రీరాముల    వారి కి ఆంజనేయ స్వామి వారే అన్ని సేవలు చేస్తూ సర్వదా  స్వామి వెంటే ఉంటూ ఉన్నారు  
 శ్రీరాముల వారి తమ్ములైన భరత,లక్ష్మణ , శతృజ్ఞులు   ఎంతగా ప్రయత్నించిన శ్రీరాముల వారికీ   సేవ కూడా చేయలేక పోతున్నారు అమీ చేద్దామన్న
ముందుగానే మారుతీ అక్కడ ఉంటున్నారు ఇలాకొంత కాలం గడిచింది ఎలా ఐన  అన్నగారి సేవ చేయాలనీ బాగా అలోచించి  భరత,లక్ష్మణ , శతృజ్ఞులు. ఒక ఉపాయం అలోచించి  అన్నగారైన శ్రీ రాముల వారి దగ్గరకు వెళ్లి  అగ్రజా  ! తమ సేవ చేయు భాగ్యము మా ముగ్గురికి ప్రసాదించవలసింది  అని కోరుకున్నారు

ఏది విన్న శ్రీరామ చంద్రుడు  మీరు అసేవ చేయాలనుకుంటున్నారో సేవను ఆనందం గా చేసుకోండి అని  చెప్పారుఏది విని ముగ్గురు సంతోషంగా  అన్నగారికి చేయాలనుకుంటున్న సేవలను ఒక పట్టికగా  రాసుకుని  ఎవరెవరు సేవ చేస్తారో రాముల వారికి చదివి వినిపించి . రాముల వారి అనుమతిని పొందారు   ఇది విన్న ఆంజనేయ స్వామి  శ్రీ రాముల వారితో స్వామి అన్ని సేవలు వారు ముగ్గురే పంచుక్కరు కదా "మరి  నా గతి  ఏమి  ? స్వామి అని  అడిగారు
 ఇంతలో   భరత,లక్ష్మణ , శతృజ్ఞులు   శ్రీ రామ చంద్రుడు మా ప్రార్ధన  మన్నించారు . వారు ఆడిన మాట తప్పారు కావున మేము కోరగా మిగిలిన సేవ ఏదైనా  ఉంటె ఆంజనేయుడు చేసుకోన వచును అని  భరత,లక్ష్మణ , శతృజ్ఞులు    చెప్పారు రాముల వారితో  అప్పుడు ఆంజనేయ స్వామి బాగా అలోచించి  "  సరే మీ షరతును అనుసరించే  కోరుకుంటాను  అని రాముల వారు "ఆవులించినపుడు " చిటిక వేసే   భాగ్యము నాకు  ప్రసాదించిన చాలును  అని అనగా  దానికి  భరత,లక్ష్మణ , శతృజ్ఞులు  మాకు అభ్యంతరం అమీ లేదు అని  సేవ ఆంజనేయుడు చేసుకోన వచ్చు  అని పలికిరి . విదముగా తీర్మానము   ఐనది
 శ్రీ రాముడు స్నానానికై లేవగా సేవ  తన వంతైనా లక్ష్మణుడు బయలుదేరాడు   ఇంతలో  హనుమతుడు  నీవేక్కడికి సేవ నావంతు  అని అన్నారు ఆశ్చర్యంగా చుసుతున్న లక్ష్మణుడితో ఆంజనేయుడు అయ్యా స్నానము చేయునపుడో, దుస్తులు దరిన్చునపుడో,అలంకరించు సమయములోనో ,భోజన కాలములోనో ,శయనించు సందర్భాములోనో  ఎప్పుడుడైన 
 " నా స్వామికి ఆవులింత రావచును అప్పుడు తక్షణమే చిటిక వేయుటకు నేను సిద్దముగా ఉండవలెను కదా ?" అందుచే మీ సేవ మీరు చేసుకునుడు  నా సేవకు అడ్డువచ్చుట  ధర్మమా ? అని అనెను ఇది విన్న   భరత,లక్ష్మణ , శతృజ్ఞులు మారుతి యొక్క యుక్తికి , అద్వితీయ సేవాసక్తికి ,రామ భక్తికి  మేచుకున్నారు


నీతి : ఆసక్తి ఉంటె అన్ని సాధ్యమే

మనం మన సంస్కృతి , మన విలువలు

                                               గోవింద 
హలో ఫ్రెండ్స్ ........
  వేసవి సెలవులు  వచేసయే కదా 
పిల్లల కోసం నీతి కధలు ఎ రోజు నుండి రోజు న పేజి లో పోస్ట్ చేస్తాను నచ్చిన  వాళ్ళు అందరు షేర్ చేయండి  నా పేజి ని ఫాల్లో అవ్వండి అందరికి ధన్యవాదములు ఈ రోజటి మొదటి కధ .............................. ! కోసం     "మన కధలు"  పేజి ని చుడండి . అలాగే నా  బ్లాగ్ ని కూడా చుడండి నచితే షేర్ చేయండి ఫ్రెండ్స్  బ్లాగ్ అడ్రస్  http://kathamadhuri.blogspot.in/ పేస్ బుక్ పేజి : https://www.facebook.com/manakathalu/