Friday 22 April 2016

మంచి మిత్రుడు

                                                        మంచి మిత్రుడు 


ఒకానొకప్పుడు   ఒక అడవిలో ఒక కాకి ,ఒక పావురం ఉండేవి అవి ఎంతో స్నేహంగా ఉండేవి చాల సంతోషంగా  కాలం గడుపుతూ ఉండేవి పావురం ఉండానితో తృప్తిగా  ఉంటూ తన పిల్లలతో సంతోషం గ ఉండేది దొరికిన గింజలను తను తన పిల్లలు తినగా కొన్ని గింజలు మరుసటి రోజుకు దాచి పెట్టుకునేది.  అందరితో మంచిగా ఉంటూ అందరి చేత మంచిదని అనిపించుకునేది అడిగిన వారికి సహాయం చేస్తూ ,



కాకి మాత్రం అందరికి పొగరుగా సమాదానం చెప్తూ  దొరికినది మొత్తం తినేసి రేపటి కోసం ఏమి  జాగ్రత్త పడకుండా ఇష్టo వచ్చి   నట్టు ఉంటూ అందరిని అవమాన పరుస్తు ఉండేది.   

ఇది  ఇలా  ఉండగా ఒకరోజు అడవిలో పెద్ద గాలి,వాన వచ్చి పావురం గూడు మొత్తం పడైపోఎంది . పావురం తన పిల్లలితో కాకి ఇంటికి వచ్చి తనకి తన్న పిల్లలకి ఉండటానికి  కొంచం చోటు ఇవ్వ మంటుంది  . దానికి కాకి పావురం తో అయ్యో మా ఇంట్లో మేము ఉండటానికే చాల ఇరుకుగా ఉంది ఇంకా మీకు అక్కడ చోటు ఇవ్వాలి కాబట్టి వేరే అవారి ఇంటి కైనా  వెళ్లి ఉండండి అని అంది . పావురం పాపం బాధ పడుతూ తన పిల్లల్ని తీసుకుని వేరే ఇంటికి వెళ్లి సహాయం అడిగింది .  వాళ్ళు పావురానికి సహాయం చేసారు 
తెల్లారి వర్షం తగ్గింది పావురం తన పిల్లల కోసం మళీ ఒక గూడు  కట్టుకుంది దానికి మిగిలిన పక్షులు అన్ని సహాయం చేసాయి   మళి పావురం తన పిల్లలితో సంతోషం గ జివించ సాగింది . 

ఇది  ఇలా  ఉండగా ఒకరోజు అడవిలో పెద్ద గాలి , వాన  వచ్చి కాకి గూడు మొత్తం పాడై  పోఇంది  కాకి తన పిల్లలని  తీసుకుని ఒక్కొక్కరి ఇంటికి వెళ్లి తను తన పిల్లలు ఉండటానికి కొంచం చోటు ఇవ్వమని బ్రతిమిలాడింది కానిఎవ్వ లేదు  ఆకరికి పావురం ఇంటికి వెళ్లి  తలుపు తట్టింది పావురం తలుపు తీసి అయ్యో మిత్రమా అంటిది ఎలా పిల్లల్ని తీసుకుని ఎ వర్షం లో అమైంది అని అడిగింది గాలి వాన కి తన గుడు  పాడై పోఎందని చెప్పింది  ఏది విన్న పావురం అయ్యో  ముందు ఇంట్లోకి రండి అని ఉండటానికి చోటు ఇచ్చి   అన్నం కూడా పెట్టింది వర్షం  తగ్గక కాకి కి ఒక గూడు కూడా కట్టుకోవడానికి  సహాయం చేసింది .  కాకి  పావురం యెక్క గొప్ప మనసుకి వ్యక్తిత్వానికి ,సంస్కారానికి  ఆశ్చర్యపడింది  ఇంతక ముందు తను పావురానికి చేసినది తల్చుకుని సిగ్గు పడి . పావురానికి క్షమాపణ చెప్పింది అప్పటి నుండి అది కూడా అందరితో  కలసి మెలసి జివించ సాగింది . 


నీతి  :  అపకారం చేసిన వాడికి కూడా ఉపకారం చేయడమే గొప్ప వాళ్ళ లక్షణం 

No comments:

Post a Comment