Saturday 23 April 2016

ముందు చూపు

                                       ముందు చూపు 



రాధ ,సిత ,గీత అనే మూడు  చేపలు ఒక నదిలో నివసిస్తూ ఉండేవి ఒక సారి వేసవిలో చెరువులో నిరు బాగా తగ్గి పోయాయి  అది గమనించిన రాధా ,సిత ,గీత లతో మనం ఈ  నదిని వదిలి వేరే నీరు  ఎక్కువగా  ఉన్న  నదిలోకి ఇప్పుడే వెళ్లి పోదాము . ఇప్పుడే ఈ నదిలో నీరు చాల తగ్గి పోఎంది ఇంకా కొన్ని  రోజులు ఐతే ఇంకా నీరు తగ్గిపోతుంది అప్పుడు చేపలు పట్టే వాళ్ళు వచ్చి మనల్ని పట్టుకు పోతారు  కాబట్టి మనం ఇప్పుడే ఈ నదిని వదిలి వెల్లిపోదాం అని అంది అది విన్న సిత ,గీత లు అ ఎప్పుడో కష్టం వస్తుంది అని ఇప్పుడే ఎందుకు ఆలోచించడం ,ఐన ఇప్పుడు మనం ఈ మడుగులో చాల సుఖం గా ఉన్నాము కదా , ఐన నువ్వు  అన్నట్టు కష్టం వచ్చిన అప్పటికి అదో ఒక ఉపాయం తట్టక పోతుందా  అని అన్నాయీ ఇది  విన్న రాధా వీళ్ళు ఎలాగు  రారు వీళ్ళతో ఉంటె నేను కూడా చావాల్సి వస్తుంది అని అది ఆ చెరువులోకి నీరు వచ్చే పిల్ల కాలువలోకి వెళ్లి దాని లో ఈదుకుంటూ బాగా నీరు ఉన్న వేరే జలాశయం లోకి చేరి సంతోషంగా   ఉంది .  కొద్ది రోజులు గడిచాయి   చెరువులో నీళ్ళుఇంకా తగ్గాయి కొందరు చేపలు పట్టే  వాళ్ళు అ చెరువులోకి వచ్చి వల వేసి చేపల్ని పట్టుకున్నారు అప్పుడు సిత, గీతాలకి రాధ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి  తన మాట విని ఉంటె మనకు ఈ రోజు  ఈ  పరిస్థితి వచ్చేది కాదు కదా అని అనుకున్నాయి ,ఇప్పుడు


ఆలోచించి ఏమి లాభం   ఇంతలో సీతకి ఒక ఆలోచన వచ్చింది ఇప్పుడు ఈ  వలలో చచ్చి నట్టు పడి  ఉండి తర్వాత సమయం చూసి తప్పించుకుంటాను అని అనుకుని ఆ వలలో పడింది జాలరి వాళ్ళు చేపలు పట్టుకుని పోయి  బురదగా ఉన్నాయి  అని కడగటానికి వేరే నీరు ఎక్కువగా ఉన్న చెరువు దగ్గరకి వెళ్లి ఆ  చేపలన్నటిని  కడగా సాగారు అప్పుడు సిత తెలివిగా ఆ వల నుండి తప్పించుకు పోయింది , పాపం గీత మాత్రం జాలరి వాడికి చిక్కి  అమ్ముడు పోయింది . 

నీతి  :  అపాయాన్ని  ముందుగా గుర్తించి తప్పించుకునే వాడే తెలివైన వాడు  ఎవారి కైనా ముందు చూపు ఉన్నపుడే  జీవితం లో ఎదురయ్యే సమస్యల నుండి తెలివిగా తప్పించుకోగలడు .  

No comments:

Post a Comment