Monday 25 April 2016

కలసి ఉంటే కలదు సుఖం

                                             

 ఒకానొకప్పుడు ఒక ఊరిలొ ఒక రైతు ఉండే వాడు అతను తనకు ఉన్న పొలంలో  పంట పండించుకుంటూ ఉన్నదాంట్లో తృప్తిగా జీవిస్తున్నాడు
 అతని భార్య కూడా అతనికి అన్ని పనులలో సహాయం చేస్తూ అత్తమామలతో ఆనందంగా కలిసి జీవిస్తున్నారు
కొన్ని సంవత్సరాలకు  వారికి నలుగురు సంతానం కలిగారు  ఆ నలుగురు పిల్లలు ఎప్పుడు తమలో తాము ఎప్పుడు గొడవపడుతూ ఉండే వారు 
తల్లి ఎంతగా  చెప్పిన వినే వారు కాదు ప్రతి చిన్న విషయానికి కొడవ పడుతూ  కొట్టుకునే వారు  ఇలాగే వాళ్ళు పెరిగి పెద్దయ్యారు తండ్రి ముసలి వాడు ఐ  పోయాడు ఈ  కొడుకులు ఇలా ప్రతి చిన్న విషయానికి గొడవపడటం ఆయనకీ తీర్చలెని చింతగా తయ్యరైనది  వీళ్ళు ఇలాగే ఉంటే జీవితం లో అన్ని కోల్పోయీ నష్టపోతారని అలోచించి అ తండ్రి కొడుకులకు కలసి ఉంటే ఉండే సుఖ సంతోషాలు ఎలా ఉంటాయో తెలియ చెప్పాలని నిర్ణయం  చేసుకుని తన నలుగురు కొడుకులని పిలిచి తనకున్న పొలాన్ని నాలుగు భాగాలు చేసి  తన కొడుకులకు ఇచ్చి ఒక మాట  చెప్తాడు  ఈ పోలాన్ని   మీ నలుగురిలో ఎవరు భాగా పండిస్తారో వాళ్ళకి ఈ పొలం మొత్తాన్ని ఇచేస్తాను అని చెప్పి పంపాడు . అది విన్న నలుగురు కొడుకులు ఎలాగైనా అ పొలాన్ని తామే దక్కించుకోవాలని ఉద్దేశం తో  ఒకరి మీద ఒకరు పోటి పడి  తమకు వచ్చినట్టుగా వ్యవసాయం చేసారు పంట చేతికి వచ్చింది ఎవరు కుడా తమ తండ్రి పండించే ధాన్యంలో సగం కూడా పండిన్చాలేకపోయారు . ఐతే ఈ నలుగురు కూడా వ్యవసాయానికి సంబందించిన ఒకొక్క పనిలో ఒకొక్కరు  మంచి నైపుణ్యం కలిగిన వారు . తండ్రి వాళ్ళు పండించిన పంటను చూసి ఒక చిరునవ్వు నవ్వి ఆ నలుగురితో  ఈ సారి మీ నలుగురు మొత్తం పొలాన్ని కలిసి పండించండి అని అన్నాడు  అది విన్న నలుగురు అన్నదమ్ములు తెల్లారి పొలం దగ్గరకు వెళ్లారు వారిలో ఎవరికి ఎపని బాగా తెలుసో వాళ్ళు ఆ పని చేస్తామని పొలం పనిని మొత్తాన్ని నాలుగు భాగాలుగా విభజించుకుని భాగా కష్ట పడి  నలుగురు కలిసి పంట పండించారు  ఈ సారి పంట భాగా వచ్చింది . తమ తండ్రి పండించే దానికన్నా ఎక్కువగా  పండించారు అది చుసిన తండ్రి వాళ్ళ నలుగురిని పిలిచి ఇప్పుడు అర్థం ఐనదా   మీకు  మీ నలుగురు విడివిడిగా పండించిన పంట కన్నా నలుగురు కలిసి ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ    కలసి పండించిన  పంట ఎక్కువగా మరియు నాణ్యంగా ఉందొ చూసారు కదా 

ఇప్పటికైనా అర్థం ఐనద విడివిడిగా ఉంటూ కష్టాలు పడుతూ ఉండే కంటే కలసి ఉంటే సంతోషం సుఖం కూడా ఉందని   అన్న తండ్రితో అ నలుగుడు కొడుకులు తండ్రి కాళ్ళ పై బడి మమ్మల్ని క్షమించండి నాన్న మీరు ఎంతగా చెప్పిన మాకు అర్థం కాలేదు కాని ఈ రోజు మాకు అర్థం ఐనది ఇంకేపుడు జీవితం లో మేము విడిపోము అని అన్నారు తన కొడుకులలో వచ్చిన మార్పును చూసి ఆ తల్లిదండ్రులు సంతోషించారు  ఆపై  ఆ అన్నదమ్ములు ఆనందంగా కలసిమెలసి జీవించారు . 

నీతి  : అందరికంటే తానె తెలివైన వాడినని భావించి ఒక్కడిగా సాధించే విజయం కంటే నలుగురితో కలసి మెలసి ఒకరికొకరు సహాయం చేసుకుంటూ పనిచేస్తే విజయాన్ని తొందరగా  పొంద వచ్చు కలసి ఉంటె ఓటమి దరిచేరదు . 


No comments:

Post a Comment