Tuesday 3 May 2016

జీవిత పాటం


                                          జీవిత పాటం 

 ఒక ఊరిలో  ఒక రైతు ఉండే వాడు  ఉన్న 3 ఎకరాల పొలం లో వ్యవసాయం చేసుకుంటూ వచ్చిన దానితో  సంతోషంగా   జీవించె వాడు ఇలా  కొంత కాలం  గడిచింది  . ఈ రైతు ఎంత కష్టపడి పంట పండించిన దానికి సరైన ధర వచ్చేది  కాదు రైతు ఎంతో దిగులుగా  ఉండే వాడు నేను ఎంత కష్ట పడుతున్న కూడా నాకు అదృష్టం కలిసి రావడం లేదు పంట బాగా వచ్చిన కూడా సరైన ధర రావడం లేదు అని ఈ సంసారాన్ని ఎలా నడపటం అని అలోచించి భాధ పడుతూ ఉండే వాడు ఎప్పుడు .  ఒక రోజు ఎలా ఆలోచిస్తూ పొలంలో కూర్చున్నాడు రైతు అ సమయంలోనే ఒక సాధువు అ దారి గుండా వెళ్తూ ఉన్నాడు వెళ్తూ వెళ్తూ ఎ రైతుని చిసి దగ్గరకు వచ్చి  ఇలా అడిగాడు ఏమైంది నాయన ఇలా దిగులుగా కూర్చున్నావ్ అని అడిగాడు  ఇంతలో అ రైతు ఆ సాదువుకి  నమస్కారం చేసి ఎలా చెప్పా సాగాడు ఏం చెప్పమంటారు స్వామి నా కష్టానికి తగిన ఫలితం ఉండటం లేదు ఎండ అనక వాన అనక కష్టపడిన కూడా న కష్టానికి తగిన ఫలితం లేకుండా పోతుంది స్వామి అని మోర పెట్టుకున్నాడు . దానికి ఆ సాధువు చిన్న చిరునవ్వు నవ్వి నాయన  భాధ పడకు అంతా మంచే జరుగుతుంది నేను చెప్పినట్టుచేయి   అని చెప్పాడు  వచ్చేది  వేసవి కాలం కదా నువ్వు ని పొలం లో సగం ఉల్లిపాయ పంట , సగం పుచ్చ పంట వేయి అని చెప్పాడు  ఆ సాధువు ఆ ఊరిలోనే కొంత కాలం ఉంటా నని చెప్పాడు దానికి ఆ రైతు స్వామి ఎక్కడో ఎందుకు  న పొలం లోనే మీకు ఉండటానికి అర్పాటు చేస్తాను మీరు ఇక్కడే నిరభ్యంతరంగా ఉండ వచ్చు ఎంత కాలం కావంటే అంతకాలం  మీకు ఎటువంటి ఇబ్భన్ది  ఉండదు అని చెప్పాడు .  అందుకు అ సాధువు సరే అని ఆ పొలం లోనే ఉండ సాగాడు ప్రతి రోజు ఆ రైతు ఆ స్వమిజికి ఆహరం తీసుకుని వచేవాడు  ప్రతి రోజు ఆ స్వామిజి చెప్పే సలహాలు సూచనలు వింటూ   తను విత్తిన పంటను సాగుచేయ సాగాడు  . వేసవి కాలం వచ్చే సరికి పంట చేతికి వచ్చింది . ఎప్పుడు ఆ రైతును  స్వామిజి నాయన  పంట బాగా పండినది కదా నువ్వు పంటను కోసి సంతకు తీసుకెళ్ళి అమ్ముకునిరా అని చెప్పాడు రైతు సంతోషంగా పంట మొత్తాన్ని కోయించి బండిలోకి ఎత్తించుకుని సంతకు తీసుకెళ్ళి  అమ్మడు అతనికి ఎప్పుడు రానంత ఆదాయం వాచ్చినది  అతడు ఎంతోసంతోషంతో అ సాధువు దగ్గరకు వచ్చి   నేను ఎప్పుడు  ఇంత  సంతోషం గ లేను స్వామి ఈ రోజు నా కష్టానికి తగిన ఫలితం వాచినది  అని చెప్పి ఇదంతా  మీ  అనుగ్రహం వల్లనే జరిగింది అని చెప్పాడు దానికి ఆ సాధువు చూడు నాయన నీకు ఒక రహస్యం చెప్తాను ఎప్పుడైనా రాబోయే కాలానికి కావలసిన పంటను ముందుగ సాగు చేయాలి అప్పుడు ఆ కాలం వచ్చే సరికి ని పంట చేతికి వస్తుంది   అలాగే నీకు ఆదాయం కూడా వస్తుంది అల కాకుండా సీజన్ వచ్చాక పంట వేస్తే అప్పుడు నీకు ధర రాదు అని చెప్పాడు అప్పటి నుండి  రైతు  కాలంకి కావాల్సిన పంటని ఆ కాలం టైం రావడానికి ముందుగానే వేస్తూ ఆ కాలం లో అ పంటను అమ్ముతూ అధిక ఆదాయం పొందుతున్నాడు  ఉన్నాడు 
ఇప్పటి ఈ స్వామిజి ఒకపటి  రైతు అందుకే తన అనుభావంతో  మంచి సలహా చెప్పా గలిగాను  అని చెప్పాడు ఆ సాధువు  


నీతి  :  అనుభవాన్ని మించిన గురువు లేడు  ఇతరుల జీవితానుభవాలన నుండి మనం మంచిని నేర్చుకోగలిగితే  జీవితం చాల బాగుంటుంది  అలా నేర్చుకున్న వాడే తెలివైన వాడు .    

No comments:

Post a Comment